Header Banner

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

  Sun May 11, 2025 10:01        Business

డబ్బు సేవ్ చేసి దాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా ఫ్యూచర్‌ను సెక్యూర్ చేసుకోవాలని అందరూ అనుకుంటారు. పోస్టాఫీస్‌ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ (Post office small savings scheme) ఇందుకు బెస్ట్ ఆప్షన్. ఈ స్కీమ్స్‌కు గవర్నమెంట్ మద్దతు ఉంటుంది. అందుకే సేఫ్టీ గ్యారంటీ. అందులో రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ చాలా పాపులర్. నెలకు రూ.5,000 సేవ్ చేస్తే రూ.లక్షల్లో రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ స్కీమ్‌లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. RD స్కీమ్ బెనిఫిట్స్, వడ్డీరేట్లు, రూ.8 లక్షల కార్పస్ ఎలా క్రియేట్ చేయొచ్చో తెలుసుకుందాం. ఈ సింపుల్ స్టెప్స్‌తో మీ ఫైనాన్షియల్ గోల్స్ చేరుకోవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్ (Low Risk Investment) ఆప్షన్. నెలకు కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మ్యాగ్జిమమ్‌ లిమిట్ లేదు. అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఈ స్కీమ్ టెన్యూర్ 5 ఏళ్లు. కానీ అవసరమైతే మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్లు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ మద్దతు వల్ల మనీ సేఫ్. వయోజనులు, మైనర్లు (10 ఏళ్లు పైబడినవాళ్లు) జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఇండియా పోస్ట్ దాదాపు 1.55 లక్షల బ్రాంచీల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. రూరల్, అర్బన్ ఇన్వెస్టర్స్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 2023లో గవర్నమెంట్ RD స్కీమ్ ఇంట్రెస్ట్‌ రేట్‌ను 6.7%కి పెంచింది. ఈ రేట్ అక్టోబర్-డిసెంబర్ 2023 క్వార్టర్ నుంచి వర్తిస్తోంది. 2025లోనూ ఈ రేట్ కంటిన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ మూడు నెలలకు ఒకసారి మారుస్తుంటారు. ఇంట్రెస్ట్‌ మూడు నెలలకు ఒకసారి కంపౌండ్ అవుతుంది. అంటే మీ మనీ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఉదాహరణకు.. నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే, 5 ఏళ్లలో రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తారు.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

6.7% ఇంట్రెస్ట్‌తో రూ.56,830 ఎక్స్‌ట్రా వస్తుంది. టోటల్ రూ.3,56,830 అవుతుంది. వడ్డీపై పన్ను విధిస్తారు. మీ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌ను బట్టి టాక్స్ వర్తిస్తుంది. ఇంట్రెస్ట్‌ రూ.10,000 దాటితే 10% TDS కట్ అవుతుంది. RD స్కీమ్‌లో 10 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.8 లక్షలకు పైగా కార్పస్ క్రియేట్ చేయొచ్చు. నెలకు రూ.5,000 సేవ్ చేస్తే, 5 ఏళ్లలో రూ.3,56,830 (రూ.3 లక్షల డిపాజిట్ + రూ.56,830 ఇంట్రెస్ట్‌) వస్తుంది. ఈ అకౌంట్‌ను మరో 5 ఏళ్లు పొడిగిస్తే 10 ఏళ్లలో టోటల్ డిపాజిట్ రూ.6 లక్షలు అవుతుంది. 6.7% ఇంట్రెస్ట్‌తో రూ.2,54,272 వడ్డీ డిపాజిట్‌ అవుతుంది. అంటే టోటల్ రూ.8,54,272. ఈ కార్పస్ ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ ప్లానింగ్ లాంటి గోల్స్‌కు హెల్ప్ అవుతుంది. RD కాలిక్యులేటర్ ఉపయోగిస్తే మెచ్యూరిటీ అమౌంట్‌ను ఈజీగా కాలిక్యులేట్‌ చేయొచ్చు. RD స్కీమ్‌లో లోన్ ఆప్షన్ కూడా ఉంది. 12 నెలల డిపాజిట్స్ పూర్తి చేసి, అకౌంట్ ఒక ఏడాది యాక్టివ్‌గా ఉంటే, అకౌంట్ బ్యాలెన్స్‌లో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ రీపేమెంట్ ఒకేసారి లేదా EMIల్లో చెల్లించొచ్చు. లోన్ ఇంట్రెస్ట్‌ రేట్‌ RD రేట్ కంటే 2% ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు RD రేట్ 6.7% ఉంటే, లోన్ రేట్ 8.7% ఉంటుంది. మెచ్యూరిటీ టైమ్‌లో లోన్ రీపే చేయకపోతే మెచ్యూరిటీ అమౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఈ ఫెసిలిటీ ఎమర్జెన్సీలో హెల్ప్ అవుతుంది. అదే సమయంలో సేవింగ్స్ కంటిన్యూ అవుతాయి. RD అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. KYC డాక్యుమెంట్స్ (ఆధార్, PAN, అడ్రస్ ప్రూఫ్) సబ్మిట్ చేయాలి. మినిమమ్ రూ.100 డిపాజిట్‌తో అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు. డిపాజిట్స్ క్యాష్ లేదా చెక్ ద్వారా చేయొచ్చు. నెలవారీ డిపాజిట్స్ 15వ తేదీ లోపు (అకౌంట్ 1-15 తేదీల మధ్య ఓపెన్ అయితే) లేదా నెలాఖరు వరకు (16 తర్వాత ఓపెన్ అయితే) చేయాలి. లేదంటే రూ.100కు రూ.1 పెనాల్టీ ఉంటుంది. నాలుగుసార్లు అలా జరిగితే అకౌంట్ డిస్‌కంటిన్యూ అవుతుంది. ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్ కూడా ఉంది. కానీ పెనాల్టీ వర్తిస్తుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PostOfiice #NewScheme #MonthlyInvestment